Do Aliens Exist?? (in Telugu)
Aliens నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? ఎక్కడ నుండి వస్తున్నాయి? అవి భూమినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? NASA నిజంగా Aliens ని interview చేసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ మీకు ఈ అర్టికాల్ లో సమాధానం దొరకబోతుంది.
Subscribe my YouTube Channel
Like my Facebook page
1969, July 20 మొదటిసారి మానవుడు, చంద్రునిపై అడుగుపెట్టిన రోజు. చంద్రునిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, తను Apollo 11 లో ప్రయాణిస్తుండగా తమను ఏదో తెలియని ఒక object follow అవుతుందని చెప్పాడు. మొదట వారు దాన్ని Detached Rocket part అనుకున్నారు. కాని అది వారికి 600 km దూరంలో కనిపించిందాని చెప్పారు. తను మొదటిసారి చంద్రునిపై నడిచినప్పుడు కూడా తమకు దూరంగా ఒక వెలుగు లాంటిది కనిపించిందని చెప్పాడు. ఆ photos ని పరిశీలించిన NASA సైంటిస్టులు, అది ఒక UFO అయ్యుండవచ్చని భావించారు. UFO అంటే Unidentified Flying Object. ఇదిలా ఉండగా NASA సైంటిస్టులు ఒక Alien ని interview చేస్తుండగా తీసిన video అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ Alien చెప్పిన దాని ప్రకారం వాళ్ళ గ్రహం పేరు భూమి అని, వాళ్ళు మన Evolutionary Decent అంటే వాళ్ళు మన తరువాతి తరం వాళ్ళని చెప్పింది. వాళ్ళు అలా మారడానికి కారణం న్యూక్లియర్ వార్. వాళ్ళు Time Travel చేశామని, Future నుండి వచ్చామని, దానికి “Offset Spacial Divergence” అనే Concept ని వాడి కాలంలో ప్రయాణి౦చామని చెప్పింది. ఇదొక్కటే కాదు ఇలాంటి ఎన్నో వీడియోస్ మరియు ఫొటోస్ Aliens ఉన్నాయని చెప్తున్నాయి.
మన భూమి ఏర్పడి ఇప్పటికి కొన్ని బిలియన్ సంవత్సరాలయ్యింది. తొమ్మిది గ్రహాలున్న మన solar system లో భూమి మీద మాత్రమే జీవం ఏర్పడింది. దానికి కారణం భూమి మీద ఉన్న వాతావరణం. కానీ మనం ఆలోచిస్తే, మన భూమి లాంటి గ్రహాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఈ విశ్వంలో మన భూమి ఒక చిన్న ఇసుకరేణువంత. అలాంటప్పుడు మనం ఎలా ఒంటరివాళ్ళం అవుతాం. మన భూమి లానే ఏదో ఒక గ్రహంలో జీవం ఏర్పడుండొచ్చు. మనలానే వాళ్ళు కూడా తమ టెక్నాలజీని develop చేసుకుంటూ ఉండొచ్చు.ఇప్పటివరకూ Aliens ఉండొచ్చు అనే దాని గురించే మనం చూసాం. కాని Aliens ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా చాలా ఆధారాలున్నాయి. అవేంటంటే,
Evidence No 1: ఈజిప్ట్ పిరమిడ్స్,
ఈజిప్ట్ పిరమిడ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అసలు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో వాళ్ళు అంత పెద్ద పిరమిడ్స్ ని ఎలా కట్టగలిగారు? ఒక వేల వాళ్ళు అప్పుడున్న టెక్నాలజీతోనే వాటిని కట్టారు అనుకుంటే, వాటిపై విమానం మరియు సబ్మెరైన్ బొమ్మలు ఎందుకున్నాయ్? అవి ఎక్కడినుండి వచ్చాయి?
Evidence No 2: WOW సిగ్నల్,
1977 లో , ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన Jerry Ehman అనే astronomer, big ear radio telescope తొ అంతరిక్షంలో నుండి వచ్చే frequencies ని రికార్డ్ చేస్తుండగా, ఒక విచిత్రమైన సిగ్నల్ ని గమనించాడు. అది దాదాపు 72 సెకండ్లపాటు వచ్చి తరువాత cut అయిపోయింది. తర్వాత దాన్ని Decode చేస్తే దానికి అర్ధం WOW అని తెలిసింది. కానీ అది ఎక్కడినుండి వచ్చింది, దాన్ని ఎవరు పంపించారు అనే విషయాలేవీ తెలియలేదు.
Evidence No 3: Alien Mega Structure,
నాసా కి చెందిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్, భూమి లాంటి గ్రహాలను కనిపెట్టడానికి డిజైన్ చెయ్యబడింది. అది కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న KIC8462852 అనే ఒక స్టార్ ని పరిసీలిస్తుండగా, ఒక భారీ నిర్మాణం స్టార్ దగ్గర కనిపించింది. అది కొన్ని సెకండ్లపాటు ఉంది. వెంటనే అదృశ్యం అయ్యింది. మొదట సైంటిస్టులు అది ఒక గ్రహం లేదా గ్రహశకలం అనుకున్నారు. కానీ వారు దాన్ని analyse చేసాకా అది planet కానీ Asteroid అయ్యే అవకాశ౦ లేదని చెప్పారు. ఒక వేళ అది planet or asteroid అయ్యుంటే అది KIC కి అడ్డువచ్చినప్పుడు Beta Rays వెలువడేవి, కానీ అలాంటివేవీ అక్కడ కనిపించలేదని చెప్పారు. అది Alines తమకు కావలసిన Solar Energy ని పొందడానికి నిర్మించిన ఒక Megastructure అని సైంటిస్టులు భావిస్తున్నారు.
Evidence No 4: High Levels of Methane in Mars Surface,
2014 లో NASA కి చెందిన స్పిరిట్ రోవర్, మార్స్ surface పైన high levels లో methane gas ఉందని కనిపెట్టింది. భూమి మీద ఉన్న methane లో 90% methane ఇక్కడున్న living argonisms వల్ల produce అవుతుంది. దీన్ని బట్టి భూమి పైన జీవం ఏర్పడకముందే mars లో జీవం ఏర్పడిఉండొచ్చని, తర్వాత వచ్చిన Asteroids వల్ల mars పైన జీవం అంతరించిపోయిందని సైంటిస్టులు చెప్తున్నారు.
Evidence No 5: Life Came From Asteroids,
భూమి మీద జీవం ఏర్పడటానికి కారణం Asteroids అని, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం Asteroids తరుచుగా భూమిని డీకోడుతూ ఉండేవి. అలా వచ్చిన asteroids లో కొన్నింటిలో జీవం ఏర్పడుండవచ్చని సైంటిస్టులు కనుగొన్నారు. దీన్ని బట్టి భూమి మీద జీవం ఏర్పడటానికి ముందే, వేరే planets లో civilization స్టార్ అయ్యుండోచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
ఇవే కాదు ఇంకా చాల ఆధారాలు Aliens ఉన్నాయని చెప్తున్నాయి. మరి Aliens ఎందుకు భూమిని targer గా చేసుకున్నాయి? ఎందుకు ఇంకా మన మీద attack చెయ్యలేదు? వాటి plan ఏంటి? దీనికి చాలా possible answers ఉన్నాయి. అవేంటంటే,
No 1: They are spread across the Universe,
Aliens, అన్ని palnets ని పరిశీలిస్తూఉండొచ్చు. మన palent కంటే ఎక్కువ వనరులున్న planets వాళ్ళకి దోరికున్డవచ్చు. అందుకే అని మనపై attack చేయడంలేదు. కాని మన భూమి వాటికి భవిష్యత్తులో అవసరమవుతుందనే నమ్మకంతో అవి మనల్ని observe చేస్తుఉండవచ్చు.
No 2: They are from the Future,
ఇప్పటి వరకు మనం చూసిన Aliens మన future నుండి వచ్చిఉండవచ్చు. అవి కేవలం మనల్ని observe చెయ్యడానికే వస్తున్నాయి. అందుకే అవి మనల్ని attack చెయ్యడంలేదు. అవి ఆ రూపంలోకి రావడానికి కారణం మనమే అని అది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అవి వస్తుండవచ్చు. దానికి ఆధారాలు పిరమిడ్స్ పైన ఉన్న బొమ్మలు. ఈజిప్ట్ నాగరికత ఉన్న కాలంలో పిరమిడ్స్ కట్టడానికి వారికి Aliens సహాయం చేసి ఉండవచ్చు. అవి అక్కడికి వచ్చాయని తెలియడం కోసమే అవి ఆ ఆధారాలను అక్కడ వదిలి వెళ్లుండవచ్చు.
No 3: They want our DNA,
Aliens తమ రూపాలను మార్చుకోవడానికి ఒక DNA కావాలి. మన DNA వాటి DNA తో సరిపోయిఉండవచ్చు. అంతే కాదు మన భూమి మీద కొన్ని వందల సంవత్సరాలు బ్రతికే జీవులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి Blue wheals, Tortois మరియు చెట్లు. వాటి DNA కోసమే అవి మన మీద ధాడి చెయ్యకపోవచ్చు.
No 4: They are Roaming among Us,
నిజానికి Aliens మన మధ్యనే తిరుగుతూ ఉండొచ్చు. కాని అవి వాడే Advanced టెక్నాలజీ వల్ల అవి మనకు కనపడకుండా తిరుగుతూ ఉండవచ్చు.
ఒక వేళ నిజంగా Aliens మన మీద attack చెయ్యాలనుకుంటే, వాటికీ కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే,
Reason No 1: Earth has Unique Resources,
Aliens వాళ్ళు observe చేసే గ్రహాలలో మన గ్రహమే వారికి దగ్గరగా ఉంటె అవి మన గ్రహానికి వెంటనే వచ్చి ధాడి చేస్తాయి. దానికి కారణం వారి గ్రహం కంటే మన గ్రహంలోనే వనరులు ఎక్కువగా ఉండటం.
Reason No 2: They want us for Food,
సైంటిస్టులు ఇటీవల చేసిన పరిశోధనలో మన పూర్వీకులు నరమాంసం తినేవారని తెలిసింది. ఆ విధంగా చూసుకుంటే ఒక వేళ Aliens కూడా అలాంటి వాళ్ళే అయితే మన మీద attack చెయ్యడం ఖాయం.
Reason No 3: They want to play with us,
మనం జంతువులతో ఎలా అయితే ఆటలాడుతున్నామో వాళ్ళు కూడా మనతో ఆడాలని నిర్ణయించుకుంటే, మరుక్షణమే అవి మనపై ధాడి చేసేస్తాయి.
Reason No 4: They want to test their weaponry,
1937 లో జర్మనీ మిలటరీ తమ బాంబ్స్ ని స్పెయిన్ లో ఉన్న గుర్నికా అనే టౌన్ మీద ప్రయోగించింది. వాళ్ళు భవిష్యత్తులో ఫ్రాన్స్, బ్రిటన్ మరియు అమెరికా మీద యుద్ధానికి తమ ఆయుధాలను టెస్ట్ చెయ్యడానికి ఆ టౌన్ ని నాశనం చేసింది. ఆ బాంబ్స్ నుండి వెలువడిన విషవాయువుల వల్ల ఆ టౌన్ లో ఉన్న కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. Aliens కూడా ఇలానే తమ ఆయుధాలను పరీక్షించాలనుకుంటే భూమి మీద చిన్న గడ్డిపూచ కూడా మిగలదు.
Reason No 5: They want to enslave us,
భూమి మీద మొత్తం జనాభా దాదాపు 600 కోట్లు. వాళ్ళు మనల్ని తమ భానిసలుగా చేసుకుంటే వారి పారిశ్రామిక అభివృద్ధికి మనం ఉపయోగపడతాం.Aliens నిజంగా ఇలా ఆలోచించుంటే మన ఇప్పటికే వాటికి భానిసలుగా మారిపోయేవాళ్ళం.
ఏదేమైనా Aliens మనతో స్నేహంగా ఉంటే మనకే మంచిది. మనం కూడా వాటి దగ్గరనుండి టెక్నాలజీ ని నేర్చుకుని, మన టెక్నాలజీ ని అభివృద్ధి చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు మనల్ని attack చెయ్యాలనుకుంటే మన దగ్గరున్న ఆయుధాలతోనే మనం వాటితో పోరాడాలి. మన భూమి మీద ఉన్న వనరులు మరికొన్ని సంవత్సరాలలో అయిపోతాయి. అప్పుడు మనం కూడా ఒక కొత్త భూమి కోసం వెతకాలి. ఒకరకంగా చెప్పాలంటే మనం కూడా Aliens లాంటివాళ్ళమే.
ఈ అర్టికాల్ మీకు నచ్చినట్లయితే నా Blog ని మరియు Facebook page ని Like చెయ్యండి. అలాగే నా YouTube Channel ని Subscribe చేసుకోండి.































0 comments:
Post a Comment