Monday, 12 June 2017

Atlantis Mystery Revealed (in Telugu)

The Lost City of Atlantis Mystery (in Telugu)

     నాగరికత, మనిషి జీవన విధానాలను, చేసే పనులను, అద్యాత్మికతను సూక్ష్మంగా తెలిపే ఒక వ్యవస్థ. ప్రపంచ దేశేలకు భారతదేశ శక్తిని చాటిన హిందూ నాగరికతైన లేక ఆధునిక నాగరికతగా పేరు పొందిన సింధూ నాగరికతైన, మనకు తెలిసినా మరియు తెలియని నాగరికతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ప్రాచీన నాగరికతలు వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అలాంటి నాగరికతలలో అతి ప్రాచీనమైనది అట్లాంటిస్ నాగరికత.


Subscribe my YouTube Channel 

Like my Facebook page

 Like

గ్రీక్ తత్వవేత్త అయిన ప్లేటో, క్రీ.పూ 360 వ సంవత్సరంలో రాసిన “టేనేయాస్” అనే పుస్తకంలో అట్లాంటిస్ ప్రస్తావన ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం అదొక ఆధునిక నిర్మాణాల నగరం. అక్కడి నిర్మాణాలకి ఎరుపు మరియు నలుపు రాళ్ళను వాడేవారు. ఆ నగరం మూడు వలయాలుగా నిర్మించబదిందని, అక్కడ చక్కటి నీటి పారుదల వ్యవస్థ ఉండేదని, వంతెనలు, ఇళ్ళు, ఆలయాలు అన్నీ ఆధునికంగా ఉండేవని ప్లేటో చెప్పారు.


వారు తమ దైవంగా “పాసైడన్” అనే దేవుడిని పూజించేవారు. పాసైడన్ గుడి నగరానికి మధ్యలో ఉండేది. పాసైడన్ ని “God of Sea” అని కూడా అంటారు. ఆ నగరంలో నిధి నిక్షేపాలు ఎక్కువగా ఉండేవి. అంతేకాదు అక్కడ దొరికే High Energy Density ఉండే క్రిస్టల్స్, వారికి కావలసిన పవర్ ని ఇస్తాయి. ఇప్పుడున్న submarines కంటే బలంగా మరియు వేగంగా వెళ్ళే submarines ని అప్పట్లో వాడేవారు. ఇప్పుడున్న అన్నీ నాగారికతలలోకి most advanced technology ఒకే ఒక్క నగరం అట్లాంటిస్. కాని అంత శక్తివంతమైన నగరం రాత్రికి రాత్రి సముద్రంలో కలిసిపాయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించిన సునామీలు మరియు భూకంపాలు అట్లాంటిస్ ని సముద్రగర్బంలో కలిపేసాయి .ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయినా ఇప్పటికి సైంటిస్టులు ఈ నగరాన్ని కనిపెట్టలేకపోయారు. కానీ ప్లేటో చెప్పిన ఆధారాలతో వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా 2001 లో క్యూబా తీరంలో కొన్ని భారీ నిర్మాణాలు ఉన్నట్లు geologist లు గుర్తించారు. కానీ ప్లేటో చెప్పిన Atlantis కి సంభందించిన ఎలాంటి ఆధారాలు అక్కడ లేవు.


తరువాత గ్రీన్లాండ్ లోని చాన్టోరిస్ లో ఇలాంటి నగరం ఒకటి బయటపడింది. అందులో ప్లేటో చెప్పినట్లు భారీ నిర్మాణాలు, కాలువలు, వాటిపై వంతెనలు మరియు నీటి పారుదల వ్యవస్థలు కూడా ఉన్నాయి. అక్కడి నిర్మాణాలు ఎరుపు మరియు నలుపు రాళ్ళతో ఉన్నాయి. కాని ప్లేటో చెప్పినట్లు ఇది సునామీల వల్ల నాశనమవ్వలేదు. అగ్నిపర్వతం పేలడం వల్ల ఇక్కడి నాగరికత అంతరించిందని Geologist లు గుర్తించారు. కాబట్టి ఇది కూడా అట్లాంటిస్ కి సంబంధించింది కాదు.

               

ఇదిలా ఉండగా అట్లాంటిస్ గురించి చాలా మంది సైంటిస్టులు ఎన్నో theories ని propose చేసారు. అందులో 5 theories బాగా popular అయ్యాయి. అవేంటంటే,

Theory.no 1: ఈ theory ప్రకారం అట్లాంటిస్ అనేది మహాసముద్రంలో ఏర్పడిన ఒక ఖండం అని, అక్కడ ఉన్న నాగరికత ప్లేటో చెప్పినట్లు లేకపోవచ్చని, అప్పటి ప్రజలకు అంత టెక్నాలజీ లేదని, కేవలం లోహాలు మరియు వ్యవసాయం గురించే వారికి తెలిసిఉండవచ్చని కొంత మంది scientist లు భావిస్తున్నారు. అంతేకాదు అట్లాంటిస్ సముద్రంలో మునిగిపోవడానికి కారణం భూమిలో ఉండే techtonic plates. ఇవి కదలడం వల్లే భూమి లోపలి పొర బలహీనపడటం వల్ల అట్లాంటిస్ నగరం ధ్వంసం అయ్యుండోచ్చని scientists భావిస్తున్నారు. Techtonic plates భూమిలోపల ఉండే రాతి పొరలు. ఇవి కదలడం వల్లే మనకు భూకంపాలు వస్తుంటాయి. ఈ techtonic plates అన్నీ ఒక ప్రదేశంలో కలుస్తాయి. ఆ ప్రదేశంలోనే జపాన్ ఉండటం వల్ల ఈ plates లో ఏ ఒక్క plate కదిలినా అది జపాన్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే జపాన్ లో భూకంపాలు ఎక్కువ.

                                    

                          
                                                      Techtonic Plates
Theory.no 2: ఈ theory ప్రకారం ఇప్పుడున్న బెర్ముడా ట్రయాంగిలే అప్పటి అట్లాంటిస్ అని, అట్లాంటిస్ ప్రజలు వాడిన high energy density ఉండే crystals, అట్లాంటిస్ అంతరించే సమయంలో సముద్రంలో కలిసిపోయాయని వాటి energy వల్లే అక్కడికి ships గానీ, planes గానీ వెళ్తే అక్కడి radiation కి తట్టుకోలేక పేలిపోతున్నాయని కొంత మంది నమ్మకం.

               

Theory.no 3: ఇప్పుడన్న అంటార్కిటికానే ఒకప్పటి అట్లాంటిస్ అని, ఇక్కడ పరిస్థితి గమనించిన అట్లాంటిస్ ప్రజలు వేరే ప్రాంతాలకు వలసివెల్లిపోయారని, అట్లాంటిస్ నగరం మంచుతో కొన్ని వందల అడుగుల లోతులో కప్పబడి ఉందని కొంతమంది వాదన. అంతేకాదు అంటార్కిటికా ఏర్పడి దాదాపు 12000 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్లేటో చెప్పినట్లు అట్లాంటిస్ 9000 సంవత్సరాలు కాదు, దాదాపు 12000 సంవత్సరాల పురాతన నాగరికత అని కొంతమంది సైంటిస్టులు భావిస్తున్నారు.

   


Theory.no 4: అట్లాంటిస్ కేవలం మాయన్ నాగరికతను ఆధారంగా తీసుకుని రాసిన కధని కొంతమంది అభిప్రాయం. మాయన్ నాగరికత క్రీ.పూ 2500 సంవత్సరాల నుండి 1600 సంవత్సరాల మధ్య ఉండేది. ఇది దాదాపు 4000 సంవత్సరాల పురాతన నాగరికత. మాయన్ నాగరికతకు అట్లాంటిస్ నాగరికతకు దగ్గర సంభందం ఉంది. అట్లాంటిస్ లో ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, కట్టడాలు అన్నీ మాయన్ నాగరికతలో కూడా ఉన్నాయి. కాని మాయన్ నాగరికత అగ్ని పర్వతాలు పేలడం వల్ల అంతమైంది. మాయన్ నాగరికత greek ద్వీపాలకు సమీపంలో ఉండేది. అగ్ని పర్వతాల నుండి వెలువడిన లావా, బూడిద మరియు దట్టమైన పొగ వల్ల అక్కడి నగరాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇది జరిగి దాదాపు 4000 సంవత్సరాలు అయ్యింది.

                           

Theory.no 5: అట్లాంటిస్ నగరం కేవలం ఒక కల్పిత కధని, ప్లేటో తన సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అట్లాంటిస్ కధని సృష్టించాడని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు.
             

ఇప్పటివరకు సైంటిస్టులు అట్లాంటిస్ నగరం సముద్రంలో అడుగున ఉందని అంచనా వేశారు. కాని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ స్పెయిన్ లో ఉన్న డోనాన అనే నేషనల్ పార్క్ లో ఇసుక మైదానాల క్రింద అట్లాంటిస్ ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. అది దాదాపు 4000 సంవత్సరాల పురాతన నాగరికతగా సైంటిస్టులు గుర్తించారు. అంతేకాదు అది అంతరించడానికి కారణం సునామి అని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. కాని 2004 లో జర్మనీకి చెందిన Rainer Kuhne అనే ఒక భౌతిక శాస్త్రవేత్త కొన్ని శాటిలైట్ images ని పరిశీలిస్తుండగా అందులో కొన్ని ఆకారాలు కనిపించాయి. అవి ఖచ్చితంగా అట్లాంటిస్ కి సంభందించిన భారీ నిర్మాణాలు అని తన పరిశోధనలో తేలింది.


మూడు దేశాలకు చెందిన సైంటిస్టుల బృందం ground-penetrating radars, electrical resistivity topography మరియు magnetometers ని ఉపయోగించి అక్కడ కొన్ని అడుగుల లోతున మానవ నిర్మిత నిర్మానణాలున్నాయని అవి పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్నాయని గుర్తించారు.

 

ఆ పరిశోధనా బృంధానికి నాయకత్వం వహించిన Richard Freund అనే ఆర్కియాలజిస్ట్ అందించిన సంమచారం ప్రకారం, అట్లాంటిస్ మధ్యదరా సముద్రంలో గానీ, aegean islands లో గానీ, Bermuda Triangle లో గానీ ఉండవచ్చని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అది ఒక ఇసుక మైదానం క్రింద ఉందని ఆయన అన్నారు. వారు ఇంకా దాని మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్లేటో చెప్పిన అట్లాంటిస్ నగరం నిజంగా ఒక కదే అయితే సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలు చేసిన పరిశోధనలు వృధా అవుతుంది. కానీ అది కూడా ఒక విధంగా మంచిదే అట్లాంటిస్ మీద సైంటిస్టులు పరిశోధనలు చేయబట్టే మనకు తెలియని పురాతన నాగరికతలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సైంటిస్టులు పడుతున్న శ్రమకు ఫలితం త్వరలోనే లభించాలని ఆశిద్ధాం.

ఈ అర్టికల్ మీకు నచ్చినట్లయితే నా Blog ని like చెయ్యండి. మరిన్ని interesting facts ని తెలుసుకోవాలంటే నా blog ని subscribe చెయ్యండి.

Share:

0 comments:

Post a Comment

Total Pageviews

Follow Us

Labels