Top 10 most Dangerous Snakes on Earth
పాములు భయంకరమైన మరియు ప్రమాదకరమైన జీవులు. మనం పాములు ప్రమాధకరమైనవి అని ఎప్పుడు చెప్తామంటే, అవి వాటి విషాన్ని మన శరీరంలోకి ఎక్కిన్చినప్పుడు. కొన్ని పాములు విడుదల చెసే విషం చిన్న ఎలుకని కూడా చంపలేదు. కాని కొన్ని పాములు విడుదల చేసే విషంతో ఏనుగుని కూడా క్షణాల్లో చంపెయోచ్చు. పాములు విడుదల చేసే విషాన్ని లెథల్ డోస్(Lethal Dose) లో కొలుస్తారు. లెథల్ డోస్ అంటే ఒక కేజీ బరువులో మిల్లి గ్రాముల వంతు. ఉదాహరణకు, LD50 అంటే ఒక కేజీ లో 50 మిల్లీగ్రాములు అని అర్ధం. ప్రపంచం లో ఉన్న 10 విషపూరితమైన పాములు గురించి చూద్దాం.
Subscribe my YouTube Channel
Like my Facebook page
No 10 : RattleSnake
Rattlesnakes ఎక్కువగా అమెరికా లో ఉంటాయి. Rattlesnake తర్వాత Eastern Diamondback అమెరికాలో అత్యంత విషపూరితమైన పాము. ఎవరైనా Rattlesnake కి దగ్గరగా వెళ్తే దాని తోక వెనక భాగంలో ఉండే గిలక్కాయ లాంటి నిర్మాణంతో శబ్థం చేస్తూ హెచ్చరిస్తుంది. అయినా దగ్గరకు వెళ్తే అది మనల్ని కాటు వేయడం ఖాయం. Rattlesnakes, Pit Viper అనే పాము జాతికి చెందినవి. ప్రపంచం లో ఉన్న అన్నీ రకాల Rattlesnakes లో Hemotoxin అనే విషం ఉంటుంది. ఇది మన body లోకి వెళ్తే మన body లో Red blood cells ని నాశనం చేస్తుంది. ఇది ఒక సారి కాటు వేస్తే చాలు అది కాటు వేసిన భాగం మొత్తం కరిగిపోతుంది. మన శరీర భాగాలకు ప్రవహించే రక్తం గడ్డకట్టుకుపోతుంది. ఒక వేల treatment చేసిన కాటు వేసిన భాగాన్ని తీసేయాలి, లేదంటే మనం చనిపోవడం ఖాయం.. ఈ పాము కాటువేసినప్పుడు ఇచ్చే Antivenom గాయం మీద త్వరగా పనిచేస్తే ప్రపంచంలో దీని వల్ల చనిపోయే వారిలో 4% మందిని మనం కాపాడొచ్చు. ఎందుకంటే దీనికిచ్చే antivenom గాయం మీద నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. ఈ లోగా కాటు వేయిన్చుకున్నవాడు చనిపోతాడు కూడా.
No 9 : Death Adder
ఇవి సాధారణంగా ఆస్ట్రేలియాలో మరియు న్యూ గునియాలో నివసిస్తు౦టాయి. ఇది మిగతా పాములను వేటాడి తింటుంది. దీనితో వేటాడబడే పాములు కూడా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములే. వీటి శరీరం చిన్నగా ఉంటుంది. వీటి తల triangle లా ఉండి, చూడటానికి viper (రక్తపింజేరు) లా ఉంటాయి. ఇవి ఒక్క సారి కాటువేస్తే LD40 నుండి LD50 మధ్యలో ఉండే 40 మిల్లీగ్రాముల నుండి 50 మిల్లిగ్రాముల విషం విడుదలవుతుంది. ఒకవేళ ఇది మిమ్మల్ని కాటువేస్తే ముందు మీ శరీరం మొత్తం Paralyze అయిపోతుంది అంటే చచ్చుబడిపోతుంది. మీ శ్వాస వ్యవస్థ దెబ్బతిని 6 గంటల్లో మీ ప్రాణం పోతుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే, మనం చనిపోవడానికి 6 గంటల సమయం ఉంటుంది కాబట్టి మనం antivenin ని తీసుకుని మనం బ్రతికి బయటపడొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా కాటువేసే పాము. అది ఉన్న place నుండి మన దగ్గరకు వచ్చి కాటువేసి మళ్ళి దాని place కి వెళ్ళడానికి అది తీసుకునే సమయం కేవలం 0.13 seconds మాత్రమే.
No 8 : Vipers
viper అంటే రక్తపింజేరు అని అర్ధం. ఇవి ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాయి. కాని ఇవి ఆసియాలోని ఇండియా మరియు జపాన్ లో ఎక్కువగా ఉంటాయి. వీటిలో saw scaled vipers మరియు chain vipers ఎక్కువ సమయం నిద్రపోతూనే ఉంటాయి. వీటికి కోపం కూడా చాలా ఎక్కువ. ఇవి సాధారణంగా బయటకు రావు. ఎక్కువగా వర్షం పాడినప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి. ఇవి చాలా వేగంగా కదులుతాయి. ఇవి కాటువేసిన చోట కండ మొత్తం సరిగిపోయి భరించలేనంత నొప్పిగా ఉంటుంది. ఇవి పంటలు ఎక్కువగా పండించేచోట నివసిస్తుంటాయి. ఇవి కాటువేసిన క్షణాల్లోనే విషం శరీరం మొత్తం వ్యాపిస్తుంది. ఇవి కాటువేసిన చోట 2 నుండి 4 వారాల వరకు నొప్పి ఉంటుంది. దీనికి త్వరగా మందు తీసుకోకపోతే, septicemia అనే వ్యాధి వస్తుంది. septicemia అంటే రక్తంలో వ్యాధికారక క్రిములు చేరడం. శ్వాస సరిగా ఆడదు, హార్ట్ ఎట్టాక్ కూడా రావచ్చు. సరైన సమయంలో మందు తీసుకోకపోతే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
No 7 : Philippine Cobra
నిజానికి cobras విశాపూరితమైనవే కానీ ప్రాణాంతకమైనవి మాత్రం కాదు. కాని philippine cobra మాత్రం అలా కాదు. ఈ పాములు దాదాపు 3 మీటర్ల వరకు తమ విషాన్ని ఉమ్మి వేయగాలవు. మీరు దీన్ని disturb చేస్తే ఇంకా మీపని అంతే. దీనిలో ఉండే neurotoxic విషం మన గుండెను మరియు మన శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ పాములు మిమ్మల్ని కాటేస్తే చాలు మీ respiratory system మొత్తం చచ్చుబడిపోయి మీరు 30 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకరు. ఇది కాటువేసిన భాగం మొత్తం కరిగిపోతుంది కాని అది అంత ప్రమాదకరం కాదు ఎందుకంటే దానికంటే ప్రమాదకరమైనది ఇంకోటుంది. అదేంటంటే అది కాటు వేసిన 20 నిమిషాలకి మీ brain dead అయిపోతుంది. మీరు బ్రతికిన జీవితాంతం కోమాలోనే ఉంటారు. ఈ పాము కాటుని మనం సులువుగా గుర్తించొచ్చు. అదెలా అంటే ఈ పాము కాటు వేస్తే వాంతులు ఎక్కువగా అవుతాయి మరియు కడుపులో విపరీతంగా నొప్పివస్తుంది. అధ్రుష్టవశాత్తు దీనికి antivenin ఉందికాబట్టి మరణాల రేటు చాలా తక్కువగా నమోదవుతుంది.
No 6 : Tiger Snake
వీటికి Tiger snake అని పేరు రావడానికి కారణం దాని శరీరం పైన ఉండే పసుపు మరియు నలుపు చారలు. దీని విషం చాలా ప్రమాదకరమైనది. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో నివసిస్తాయి. ఇవి కాటువేస్తే అది ఏ జంతువైనా 30 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకదు. దీనికి antivenom కనిపెట్టకముందు దీని కాటుకి బలైన వారు దాదాపు 70% మంది ఉన్నారు. ఇది కాటు వేసినప్పుడు ముందు మెడ క్రింది భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. గాలి పీల్చుకోవడం కూడా ఖష్టమైపోతుంది. ఇవి సాధారణంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. వీటికి సాధారణంగా కోపం రాదూ, మీరు వాటిని మరీ మొహమాటపెడితే ఒక కాటు వేస్తాయి. వాటికి కోపం తెప్పిస్తే మీరు direct హాస్పిటల్కే.
No 5 : Black Mamba
Black మామ్బాలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. భూమి మీద ఉన్న పాములన్నిటిలోకి ఇవే అతి వేగంగా కదిలే పాములు. ఇవి గంటకి 20 కి.మీల వేగంతో కదులుతాయి. వీటికి కోపం చాలా ఎక్కువ, వీటికి accuracy చాలా ఎక్కువ, కాటువేసిన చోట at a time 12 కాట్లు దాకా వేసేస్తుంది. దీని ఒక్క కాటు నుండి వచ్చే విషంతో 10 నుండి 25 మంది చంపొచ్చు. మిగతా విషపూరితమైన పాముల్లానే వీటి విషంకూడా LD50 concentration తో మనుషుల మీద చాల త్వరగా ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక్క కాటులో దాదాపు 150mg నుండి 400mg వరకు విడుదల చేయగలదు. black mamba కాటు వేసిన వ్యక్తికి శరీరం మొత్తం వణుకు పుడుతుంది. అంతే కాదు చూపు కూడా మందగిస్తుంది. మీ మెదడు confusion కి గురవుతుంది. మీ శరీరంలో ఒక్కో భాగం పనిచేయడం మానేస్తుంది. కొన్ని క్షణాల్లోనే మీకు heart attack వచ్చి మీరు కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఒక వేళ black mamba తన విషాన్ని మన veins లోకి direct గా ఎక్కిస్తే మనం బ్రతికేది కేవలం 15 నిమిషాలు మాత్రమే.
No 4 : Taipan
Taipan లు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. Taipan ఒక్కసారి కాటువేస్తే వచ్చే విషంతో 12,000
గునియా పందులను చంపొచ్చు. దీని నుండి వచ్చే విషం వల్ల రక్తం గడ్డకట్టుకుపోయి, గుండె పని తీరును దెబ్బతీస్తుంది. వీటికి కోపం చాల ఎక్కువ మరియు ఇవి చాలా చురుకైనవి. వీటి లక్షణాలు ఎక్కువగా black mamba ను పోలి ఉంటాయి. వీటి విషంలో neurotoxic content ఎక్కువ. దీనికి antivenin కనిపెట్టకముందు, ఒక్కరుకూడా ఈ పాము కాటు వేసాక బ్రతికి బయటపడలేదు. ఈ పాము కాటు వేసిన గంటలోనే మీకు యముడు కనిపిస్తాడు. ఒక వేళ మీరు బ్రతికినా కూడా పూర్తిగా కోలుకోవడానికి 5 నెలలు పడుతుంది.
No 3 : Blue Krait
ఈ పాములు ఎక్కువగా South East Asia లో మరియు Indonesia లో ఉంటాయి. Blue Krait, వాటి జాతిలోనే అత్యంత విషపూరితమైన పాము. Blue krait ని తెలుగులో కట్ల పాము అంటారు. ఒక వేల దీని కాటుకి antivenin ఇచ్చినా, దీని విషంలో సగం చాలు మనిషిని చంపడానికి. ఇవి సాధారణంగా మిగతా పాములను వేటాడి తింటాయి. ఇవి రాత్రి పూట మాత్రమే తిరుగుతాయి. ఎందుకంటే వీటికి సిగ్గు ఎక్కువ. సాధ్యమైనంత వరకు ఇవి వేటితోనూ గొడవ పెట్టుకోవు. వీటి విషం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల శరీరంలో ఉన్న కండరాలన్నీ చచ్చుబడిపోతాయి. ఇవి రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తాయి. దీనికి విరుగుడు కనిపెట్టక ముందు, దీని కాటు బారిన పడిన వారిలో 85% మంది చనిపోయారు.
No 2 : Eastern Brown Snake
దీనిని Pseudonaja textilis అని కూడా అంటారు. ఇది చాలా విషపూరితమైనది. దీని కాటులో 1/14 వంతు చాలు ఒక మనిషిని successful గా చంపడానికి. మన అద్రుష్టం ఏంటంటే ఇవి మన౦ ఉన్న చోటే జీవిస్తాయంట!! అంటే ఇవి population ఎక్కువగా ఉన్న area లో జీవించడానికి ఇష్టపడతాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఇవి వేగంగా కదులుతాయి మరియు వీటికి కోపం కూడా చాలా ఎక్కువ. ఇవి target చేసిన వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా వెంటాడి మరీ కాటేస్తాయి. ఒక కాదూ రెండు కాదూ వరుసగా కాటు వేస్తూనే ఉంటాయి. అప్పుడే పుట్టిన వీటి పిల్లలు కూడా మనిషిని చంపగల విషాన్ని కలిగి ఉంటాయి. దీని విషంలో మెదడుని పనిచేయనీయకుండా చేసే మరియు రక్తాన్ని గడ్డ కట్టించే toxins ఉంటాయి. అందుకే ఇవి మన list లో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇవి మనిషి కదిలినప్పుడు మాత్రమే కాటు వేస్తాయి. ఇవి వేసే కాట్లలో కొన్నింటిలో విషం ఉండదు.
No 1 : Fierce Snake (Inland Taipan)
దీన్ని ఇన్లాండ్ తైపాన్ అని కూడా అంటారు. ఇది భూమి మీద ఉన్న పాములన్నిటికి godfather లాంటిది. ఇది ఒక్క కాటులో 11mg ల విషాన్ని విడుదల చేస్తుంది ఈ 11mg ల విషంతో 100 మందిని చాలా easy గా చంపెయోచ్చు. ఇది LD50 ఉన్న విషాన్ని విడుదల చేస్తుంది. ఇది మనిషిని చంపే విషం కంటే 10 రెట్లు శక్తివంతమైనది. మన అద్రుష్టం ఏంటంటే, వీటికి సాధారణంగా కోపం రాదు. దురద్రుష్టం ఏంటంటే, ఇది కాటువేస్తే మనిషి 45 నిమిషాల్లో చనిపోతాడు. మళ్ళి మంచి news ఏంటంటే ఇప్పటివరకు దీని కాటుకు మనుషులు బలైనట్లు ఒక్క కేసు రికార్డ్ అవ్వలేదు.

























0 comments:
Post a Comment