Interesting Facts in the world (in Telugu)

Here there are some interesting facts in the world in Telugu. We cover some facts all over the world. Our world is full of wonders, mysteries, cultures and traditions. People live in faith and worship god. And we are here to take you to the new world of education and entertainment.

The Lost City of Atlantis Mystery (in Telugu)

There are so many mysteries in the world still cannot be solved. Atlantis is also come into that kind. Here is the detailed information about Atlantis City.

Do Aliens Exist?? (in Telugu)

Aliens are called as Extraterrastrial Biological Entities in shortly called as EBEs. See this artical about aliens existanca and mystery of Aliens from future. we covered all the information you want to know. so lets read this artical by clicking on this.

Top 10 Most Dangerous Snakes on Earth (in Telugu)

Snakes are more scary at the same time more dangerous creatures. A snake is classified as poisonous when they are capable of injecting venom. Some snakes have venom that cannot kill even a small mice. But some poisonous snakes have dangerous venom that can kill elephant with in seconds. So let’s see the Top 10 most poisonous snakes on Earth by clicking on this

Dragonball series all seasons episodes for dragonball Fans

Watch all Dragonball series episode for free. Dragonball series is one of the best animated series in the world. The characters from this series have tremendous response.

Saturday, 17 June 2017

Aliens Mystery Revealed!!! (in Telugu)

Do Aliens Exist?? (in Telugu)


Aliens నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? ఎక్కడ నుండి వస్తున్నాయి? అవి భూమినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? NASA నిజంగా Aliens ని interview చేసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ మీకు ఈ అర్టికాల్ లో సమాధానం దొరకబోతుంది.


Subscribe my YouTube Channel 

Like my Facebook page

 Like


1969, July 20 మొదటిసారి మానవుడు, చంద్రునిపై అడుగుపెట్టిన రోజు. చంద్రునిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, తను Apollo 11 లో ప్రయాణిస్తుండగా తమను ఏదో తెలియని ఒక object follow అవుతుందని చెప్పాడు. మొదట వారు దాన్ని Detached Rocket part అనుకున్నారు. కాని అది వారికి 600 km దూరంలో కనిపించిందాని చెప్పారు. తను మొదటిసారి చంద్రునిపై నడిచినప్పుడు కూడా తమకు దూరంగా ఒక వెలుగు లాంటిది కనిపించిందని చెప్పాడు. ఆ photos ని పరిశీలించిన NASA సైంటిస్టులు, అది ఒక UFO అయ్యుండవచ్చని భావించారు. UFO అంటే Unidentified Flying Object. ఇదిలా ఉండగా NASA సైంటిస్టులు ఒక Alien ని interview చేస్తుండగా తీసిన video అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ Alien చెప్పిన దాని ప్రకారం వాళ్ళ గ్రహం పేరు భూమి అని, వాళ్ళు మన Evolutionary Decent అంటే వాళ్ళు మన తరువాతి తరం వాళ్ళని చెప్పింది. వాళ్ళు అలా మారడానికి కారణం న్యూక్లియర్ వార్. వాళ్ళు Time Travel చేశామని, Future నుండి వచ్చామని, దానికి “Offset Spacial Divergence” అనే Concept ని వాడి కాలంలో ప్రయాణి౦చామని చెప్పింది. ఇదొక్కటే కాదు ఇలాంటి ఎన్నో వీడియోస్ మరియు ఫొటోస్ Aliens ఉన్నాయని చెప్తున్నాయి.






మన భూమి ఏర్పడి ఇప్పటికి కొన్ని బిలియన్ సంవత్సరాలయ్యింది. తొమ్మిది గ్రహాలున్న మన solar system లో భూమి మీద మాత్రమే జీవం ఏర్పడింది. దానికి కారణం భూమి మీద ఉన్న వాతావరణం. కానీ మనం ఆలోచిస్తే, మన భూమి లాంటి గ్రహాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఈ విశ్వంలో మన భూమి ఒక చిన్న ఇసుకరేణువంత. అలాంటప్పుడు మనం ఎలా ఒంటరివాళ్ళం అవుతాం. మన భూమి లానే ఏదో ఒక గ్రహంలో జీవం ఏర్పడుండొచ్చు. మనలానే వాళ్ళు కూడా తమ టెక్నాలజీని develop చేసుకుంటూ ఉండొచ్చు.ఇప్పటివరకూ Aliens ఉండొచ్చు అనే దాని గురించే మనం చూసాం. కాని Aliens ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా చాలా ఆధారాలున్నాయి. అవేంటంటే,



Evidence No 1: ఈజిప్ట్ పిరమిడ్స్,

ఈజిప్ట్ పిరమిడ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అసలు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో వాళ్ళు అంత పెద్ద పిరమిడ్స్ ని ఎలా కట్టగలిగారు? ఒక వేల వాళ్ళు అప్పుడున్న టెక్నాలజీతోనే వాటిని కట్టారు అనుకుంటే, వాటిపై విమానం మరియు సబ్మెరైన్ బొమ్మలు ఎందుకున్నాయ్? అవి ఎక్కడినుండి వచ్చాయి?

               


Evidence No 2: WOW సిగ్నల్,
1977 లో , ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన Jerry Ehman అనే astronomer, big ear radio telescope తొ అంతరిక్షంలో నుండి వచ్చే frequencies ని రికార్డ్ చేస్తుండగా, ఒక విచిత్రమైన సిగ్నల్ ని గమనించాడు. అది దాదాపు 72 సెకండ్లపాటు వచ్చి తరువాత cut అయిపోయింది. తర్వాత దాన్ని Decode చేస్తే దానికి అర్ధం WOW అని తెలిసింది. కానీ అది ఎక్కడినుండి వచ్చింది, దాన్ని ఎవరు పంపించారు అనే విషయాలేవీ తెలియలేదు.

 

Evidence No 3: Alien Mega Structure,
నాసా కి చెందిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్, భూమి లాంటి గ్రహాలను కనిపెట్టడానికి డిజైన్ చెయ్యబడింది. అది కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న KIC8462852 అనే ఒక స్టార్ ని పరిసీలిస్తుండగా, ఒక భారీ నిర్మాణం స్టార్ దగ్గర కనిపించింది. అది కొన్ని సెకండ్లపాటు ఉంది. వెంటనే అదృశ్యం అయ్యింది. మొదట సైంటిస్టులు అది ఒక గ్రహం లేదా గ్రహశకలం అనుకున్నారు. కానీ వారు దాన్ని analyse చేసాకా అది planet కానీ Asteroid అయ్యే అవకాశ౦ లేదని చెప్పారు. ఒక వేళ అది planet or asteroid అయ్యుంటే అది KIC కి అడ్డువచ్చినప్పుడు Beta Rays వెలువడేవి, కానీ అలాంటివేవీ అక్కడ కనిపించలేదని చెప్పారు. అది Alines తమకు కావలసిన Solar Energy ని పొందడానికి నిర్మించిన ఒక Megastructure అని సైంటిస్టులు భావిస్తున్నారు.


             


Evidence No 4: High Levels of Methane in Mars Surface,
2014 లో NASA కి చెందిన స్పిరిట్ రోవర్, మార్స్ surface పైన high levels లో methane gas ఉందని కనిపెట్టింది. భూమి మీద ఉన్న methane లో 90% methane ఇక్కడున్న living argonisms వల్ల produce అవుతుంది. దీన్ని బట్టి భూమి పైన జీవం ఏర్పడకముందే mars లో జీవం ఏర్పడిఉండొచ్చని, తర్వాత వచ్చిన Asteroids వల్ల mars పైన జీవం అంతరించిపోయిందని సైంటిస్టులు చెప్తున్నారు.

                              

Evidence No 5: Life Came From Asteroids,
భూమి మీద జీవం ఏర్పడటానికి కారణం Asteroids అని, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం Asteroids తరుచుగా భూమిని డీకోడుతూ ఉండేవి. అలా వచ్చిన asteroids లో కొన్నింటిలో జీవం ఏర్పడుండవచ్చని సైంటిస్టులు కనుగొన్నారు. దీన్ని బట్టి భూమి మీద జీవం ఏర్పడటానికి ముందే, వేరే planets లో civilization స్టార్ అయ్యుండోచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.


ఇవే కాదు ఇంకా చాల ఆధారాలు Aliens ఉన్నాయని చెప్తున్నాయి. మరి Aliens  ఎందుకు భూమిని targer గా చేసుకున్నాయి? ఎందుకు ఇంకా మన మీద attack చెయ్యలేదు? వాటి plan ఏంటి? దీనికి చాలా possible answers ఉన్నాయి. అవేంటంటే,

No 1: They are spread across the Universe,
Aliens, అన్ని palnets ని పరిశీలిస్తూఉండొచ్చు. మన palent కంటే ఎక్కువ వనరులున్న planets వాళ్ళకి దోరికున్డవచ్చు. అందుకే అని మనపై attack చేయడంలేదు. కాని మన భూమి వాటికి భవిష్యత్తులో అవసరమవుతుందనే నమ్మకంతో అవి మనల్ని observe చేస్తుఉండవచ్చు.

 

No 2: They are from the Future,
ఇప్పటి వరకు మనం చూసిన Aliens మన future నుండి వచ్చిఉండవచ్చు. అవి కేవలం మనల్ని observe చెయ్యడానికే వస్తున్నాయి. అందుకే అవి మనల్ని attack చెయ్యడంలేదు. అవి ఆ రూపంలోకి రావడానికి కారణం మనమే అని అది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అవి వస్తుండవచ్చు. దానికి ఆధారాలు పిరమిడ్స్ పైన ఉన్న బొమ్మలు. ఈజిప్ట్ నాగరికత ఉన్న కాలంలో పిరమిడ్స్ కట్టడానికి వారికి Aliens సహాయం చేసి ఉండవచ్చు. అవి అక్కడికి వచ్చాయని తెలియడం కోసమే అవి ఆ ఆధారాలను అక్కడ వదిలి వెళ్లుండవచ్చు.

 

No 3: They want our DNA,
Aliens తమ రూపాలను మార్చుకోవడానికి ఒక DNA కావాలి. మన DNA వాటి DNA తో సరిపోయిఉండవచ్చు. అంతే కాదు మన భూమి మీద కొన్ని వందల సంవత్సరాలు బ్రతికే జీవులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి Blue wheals, Tortois మరియు చెట్లు. వాటి DNA కోసమే అవి మన మీద ధాడి చెయ్యకపోవచ్చు.

 

No 4: They are Roaming among Us,
నిజానికి Aliens మన మధ్యనే తిరుగుతూ ఉండొచ్చు. కాని అవి వాడే Advanced టెక్నాలజీ వల్ల అవి మనకు కనపడకుండా తిరుగుతూ ఉండవచ్చు.

 

ఒక వేళ నిజంగా Aliens మన మీద attack చెయ్యాలనుకుంటే, వాటికీ కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే,
Reason No 1: Earth has Unique Resources,
Aliens వాళ్ళు observe చేసే గ్రహాలలో మన గ్రహమే వారికి దగ్గరగా ఉంటె అవి మన గ్రహానికి వెంటనే వచ్చి ధాడి చేస్తాయి. దానికి కారణం వారి గ్రహం కంటే మన గ్రహంలోనే వనరులు ఎక్కువగా ఉండటం.

 

Reason No 2: They want us for Food,
సైంటిస్టులు ఇటీవల చేసిన పరిశోధనలో మన పూర్వీకులు నరమాంసం తినేవారని తెలిసింది. ఆ విధంగా చూసుకుంటే ఒక వేళ Aliens కూడా అలాంటి వాళ్ళే అయితే మన మీద attack చెయ్యడం ఖాయం.

 

Reason No 3: They want to play with us,
మనం జంతువులతో ఎలా అయితే ఆటలాడుతున్నామో వాళ్ళు కూడా మనతో ఆడాలని నిర్ణయించుకుంటే, మరుక్షణమే అవి మనపై ధాడి చేసేస్తాయి.

 

Reason No 4: They want to test their weaponry,
1937 లో జర్మనీ మిలటరీ తమ బాంబ్స్ ని స్పెయిన్ లో ఉన్న గుర్నికా అనే టౌన్ మీద ప్రయోగించింది. వాళ్ళు భవిష్యత్తులో ఫ్రాన్స్, బ్రిటన్ మరియు అమెరికా మీద యుద్ధానికి తమ ఆయుధాలను టెస్ట్ చెయ్యడానికి ఆ టౌన్ ని నాశనం చేసింది. ఆ బాంబ్స్ నుండి వెలువడిన విషవాయువుల వల్ల ఆ టౌన్ లో ఉన్న కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. Aliens కూడా ఇలానే తమ ఆయుధాలను పరీక్షించాలనుకుంటే భూమి మీద చిన్న గడ్డిపూచ కూడా మిగలదు.

 

Reason No 5: They want to enslave us,
భూమి మీద మొత్తం జనాభా దాదాపు 600 కోట్లు. వాళ్ళు మనల్ని తమ భానిసలుగా చేసుకుంటే వారి పారిశ్రామిక అభివృద్ధికి మనం ఉపయోగపడతాం.Aliens నిజంగా ఇలా ఆలోచించుంటే మన ఇప్పటికే వాటికి భానిసలుగా మారిపోయేవాళ్ళం.

 

ఏదేమైనా Aliens మనతో స్నేహంగా ఉంటే మనకే మంచిది. మనం కూడా వాటి దగ్గరనుండి టెక్నాలజీ ని నేర్చుకుని, మన టెక్నాలజీ ని అభివృద్ధి చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు మనల్ని attack చెయ్యాలనుకుంటే మన దగ్గరున్న ఆయుధాలతోనే మనం వాటితో పోరాడాలి. మన భూమి మీద ఉన్న వనరులు మరికొన్ని సంవత్సరాలలో అయిపోతాయి. అప్పుడు మనం కూడా ఒక కొత్త భూమి కోసం వెతకాలి. ఒకరకంగా చెప్పాలంటే మనం కూడా Aliens లాంటివాళ్ళమే.

ఈ అర్టికాల్ మీకు నచ్చినట్లయితే నా Blog ని మరియు Facebook page ని Like చెయ్యండి. అలాగే నా YouTube Channel ని Subscribe చేసుకోండి.                          

Share:

Monday, 12 June 2017

Atlantis Mystery Revealed (in Telugu)

The Lost City of Atlantis Mystery (in Telugu)

     నాగరికత, మనిషి జీవన విధానాలను, చేసే పనులను, అద్యాత్మికతను సూక్ష్మంగా తెలిపే ఒక వ్యవస్థ. ప్రపంచ దేశేలకు భారతదేశ శక్తిని చాటిన హిందూ నాగరికతైన లేక ఆధునిక నాగరికతగా పేరు పొందిన సింధూ నాగరికతైన, మనకు తెలిసినా మరియు తెలియని నాగరికతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ప్రాచీన నాగరికతలు వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అలాంటి నాగరికతలలో అతి ప్రాచీనమైనది అట్లాంటిస్ నాగరికత.


Subscribe my YouTube Channel 

Like my Facebook page

 Like

గ్రీక్ తత్వవేత్త అయిన ప్లేటో, క్రీ.పూ 360 వ సంవత్సరంలో రాసిన “టేనేయాస్” అనే పుస్తకంలో అట్లాంటిస్ ప్రస్తావన ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం అదొక ఆధునిక నిర్మాణాల నగరం. అక్కడి నిర్మాణాలకి ఎరుపు మరియు నలుపు రాళ్ళను వాడేవారు. ఆ నగరం మూడు వలయాలుగా నిర్మించబదిందని, అక్కడ చక్కటి నీటి పారుదల వ్యవస్థ ఉండేదని, వంతెనలు, ఇళ్ళు, ఆలయాలు అన్నీ ఆధునికంగా ఉండేవని ప్లేటో చెప్పారు.


వారు తమ దైవంగా “పాసైడన్” అనే దేవుడిని పూజించేవారు. పాసైడన్ గుడి నగరానికి మధ్యలో ఉండేది. పాసైడన్ ని “God of Sea” అని కూడా అంటారు. ఆ నగరంలో నిధి నిక్షేపాలు ఎక్కువగా ఉండేవి. అంతేకాదు అక్కడ దొరికే High Energy Density ఉండే క్రిస్టల్స్, వారికి కావలసిన పవర్ ని ఇస్తాయి. ఇప్పుడున్న submarines కంటే బలంగా మరియు వేగంగా వెళ్ళే submarines ని అప్పట్లో వాడేవారు. ఇప్పుడున్న అన్నీ నాగారికతలలోకి most advanced technology ఒకే ఒక్క నగరం అట్లాంటిస్. కాని అంత శక్తివంతమైన నగరం రాత్రికి రాత్రి సముద్రంలో కలిసిపాయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించిన సునామీలు మరియు భూకంపాలు అట్లాంటిస్ ని సముద్రగర్బంలో కలిపేసాయి .ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయినా ఇప్పటికి సైంటిస్టులు ఈ నగరాన్ని కనిపెట్టలేకపోయారు. కానీ ప్లేటో చెప్పిన ఆధారాలతో వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా 2001 లో క్యూబా తీరంలో కొన్ని భారీ నిర్మాణాలు ఉన్నట్లు geologist లు గుర్తించారు. కానీ ప్లేటో చెప్పిన Atlantis కి సంభందించిన ఎలాంటి ఆధారాలు అక్కడ లేవు.


తరువాత గ్రీన్లాండ్ లోని చాన్టోరిస్ లో ఇలాంటి నగరం ఒకటి బయటపడింది. అందులో ప్లేటో చెప్పినట్లు భారీ నిర్మాణాలు, కాలువలు, వాటిపై వంతెనలు మరియు నీటి పారుదల వ్యవస్థలు కూడా ఉన్నాయి. అక్కడి నిర్మాణాలు ఎరుపు మరియు నలుపు రాళ్ళతో ఉన్నాయి. కాని ప్లేటో చెప్పినట్లు ఇది సునామీల వల్ల నాశనమవ్వలేదు. అగ్నిపర్వతం పేలడం వల్ల ఇక్కడి నాగరికత అంతరించిందని Geologist లు గుర్తించారు. కాబట్టి ఇది కూడా అట్లాంటిస్ కి సంబంధించింది కాదు.

               

ఇదిలా ఉండగా అట్లాంటిస్ గురించి చాలా మంది సైంటిస్టులు ఎన్నో theories ని propose చేసారు. అందులో 5 theories బాగా popular అయ్యాయి. అవేంటంటే,

Theory.no 1: ఈ theory ప్రకారం అట్లాంటిస్ అనేది మహాసముద్రంలో ఏర్పడిన ఒక ఖండం అని, అక్కడ ఉన్న నాగరికత ప్లేటో చెప్పినట్లు లేకపోవచ్చని, అప్పటి ప్రజలకు అంత టెక్నాలజీ లేదని, కేవలం లోహాలు మరియు వ్యవసాయం గురించే వారికి తెలిసిఉండవచ్చని కొంత మంది scientist లు భావిస్తున్నారు. అంతేకాదు అట్లాంటిస్ సముద్రంలో మునిగిపోవడానికి కారణం భూమిలో ఉండే techtonic plates. ఇవి కదలడం వల్లే భూమి లోపలి పొర బలహీనపడటం వల్ల అట్లాంటిస్ నగరం ధ్వంసం అయ్యుండోచ్చని scientists భావిస్తున్నారు. Techtonic plates భూమిలోపల ఉండే రాతి పొరలు. ఇవి కదలడం వల్లే మనకు భూకంపాలు వస్తుంటాయి. ఈ techtonic plates అన్నీ ఒక ప్రదేశంలో కలుస్తాయి. ఆ ప్రదేశంలోనే జపాన్ ఉండటం వల్ల ఈ plates లో ఏ ఒక్క plate కదిలినా అది జపాన్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే జపాన్ లో భూకంపాలు ఎక్కువ.

                                    

                          
                                                      Techtonic Plates
Theory.no 2: ఈ theory ప్రకారం ఇప్పుడున్న బెర్ముడా ట్రయాంగిలే అప్పటి అట్లాంటిస్ అని, అట్లాంటిస్ ప్రజలు వాడిన high energy density ఉండే crystals, అట్లాంటిస్ అంతరించే సమయంలో సముద్రంలో కలిసిపోయాయని వాటి energy వల్లే అక్కడికి ships గానీ, planes గానీ వెళ్తే అక్కడి radiation కి తట్టుకోలేక పేలిపోతున్నాయని కొంత మంది నమ్మకం.

               

Theory.no 3: ఇప్పుడన్న అంటార్కిటికానే ఒకప్పటి అట్లాంటిస్ అని, ఇక్కడ పరిస్థితి గమనించిన అట్లాంటిస్ ప్రజలు వేరే ప్రాంతాలకు వలసివెల్లిపోయారని, అట్లాంటిస్ నగరం మంచుతో కొన్ని వందల అడుగుల లోతులో కప్పబడి ఉందని కొంతమంది వాదన. అంతేకాదు అంటార్కిటికా ఏర్పడి దాదాపు 12000 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్లేటో చెప్పినట్లు అట్లాంటిస్ 9000 సంవత్సరాలు కాదు, దాదాపు 12000 సంవత్సరాల పురాతన నాగరికత అని కొంతమంది సైంటిస్టులు భావిస్తున్నారు.

   


Theory.no 4: అట్లాంటిస్ కేవలం మాయన్ నాగరికతను ఆధారంగా తీసుకుని రాసిన కధని కొంతమంది అభిప్రాయం. మాయన్ నాగరికత క్రీ.పూ 2500 సంవత్సరాల నుండి 1600 సంవత్సరాల మధ్య ఉండేది. ఇది దాదాపు 4000 సంవత్సరాల పురాతన నాగరికత. మాయన్ నాగరికతకు అట్లాంటిస్ నాగరికతకు దగ్గర సంభందం ఉంది. అట్లాంటిస్ లో ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, కట్టడాలు అన్నీ మాయన్ నాగరికతలో కూడా ఉన్నాయి. కాని మాయన్ నాగరికత అగ్ని పర్వతాలు పేలడం వల్ల అంతమైంది. మాయన్ నాగరికత greek ద్వీపాలకు సమీపంలో ఉండేది. అగ్ని పర్వతాల నుండి వెలువడిన లావా, బూడిద మరియు దట్టమైన పొగ వల్ల అక్కడి నగరాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇది జరిగి దాదాపు 4000 సంవత్సరాలు అయ్యింది.

                           

Theory.no 5: అట్లాంటిస్ నగరం కేవలం ఒక కల్పిత కధని, ప్లేటో తన సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అట్లాంటిస్ కధని సృష్టించాడని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు.
             

ఇప్పటివరకు సైంటిస్టులు అట్లాంటిస్ నగరం సముద్రంలో అడుగున ఉందని అంచనా వేశారు. కాని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ స్పెయిన్ లో ఉన్న డోనాన అనే నేషనల్ పార్క్ లో ఇసుక మైదానాల క్రింద అట్లాంటిస్ ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. అది దాదాపు 4000 సంవత్సరాల పురాతన నాగరికతగా సైంటిస్టులు గుర్తించారు. అంతేకాదు అది అంతరించడానికి కారణం సునామి అని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. కాని 2004 లో జర్మనీకి చెందిన Rainer Kuhne అనే ఒక భౌతిక శాస్త్రవేత్త కొన్ని శాటిలైట్ images ని పరిశీలిస్తుండగా అందులో కొన్ని ఆకారాలు కనిపించాయి. అవి ఖచ్చితంగా అట్లాంటిస్ కి సంభందించిన భారీ నిర్మాణాలు అని తన పరిశోధనలో తేలింది.


మూడు దేశాలకు చెందిన సైంటిస్టుల బృందం ground-penetrating radars, electrical resistivity topography మరియు magnetometers ని ఉపయోగించి అక్కడ కొన్ని అడుగుల లోతున మానవ నిర్మిత నిర్మానణాలున్నాయని అవి పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్నాయని గుర్తించారు.

 

ఆ పరిశోధనా బృంధానికి నాయకత్వం వహించిన Richard Freund అనే ఆర్కియాలజిస్ట్ అందించిన సంమచారం ప్రకారం, అట్లాంటిస్ మధ్యదరా సముద్రంలో గానీ, aegean islands లో గానీ, Bermuda Triangle లో గానీ ఉండవచ్చని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అది ఒక ఇసుక మైదానం క్రింద ఉందని ఆయన అన్నారు. వారు ఇంకా దాని మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్లేటో చెప్పిన అట్లాంటిస్ నగరం నిజంగా ఒక కదే అయితే సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలు చేసిన పరిశోధనలు వృధా అవుతుంది. కానీ అది కూడా ఒక విధంగా మంచిదే అట్లాంటిస్ మీద సైంటిస్టులు పరిశోధనలు చేయబట్టే మనకు తెలియని పురాతన నాగరికతలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సైంటిస్టులు పడుతున్న శ్రమకు ఫలితం త్వరలోనే లభించాలని ఆశిద్ధాం.

ఈ అర్టికల్ మీకు నచ్చినట్లయితే నా Blog ని like చెయ్యండి. మరిన్ని interesting facts ని తెలుసుకోవాలంటే నా blog ని subscribe చెయ్యండి.

Share:

Saturday, 10 June 2017

Interesting Facts in the World (in Telugu)

Interesting Facts In Telugu - Part 1


Here there are some interesting facts in the world in Telugu. We cover some facts all over the world. Our world is full of wonders, mysteries, cultures and traditions. People live in faith and worship god. And we are here to take you to the new world of education and entertainment.



Subscribe my YouTube Channel 

Like my Facebook page

 Like

1. బొద్దింకలు , డైనోసార్స్ కంటే 120 million సంవత్సరాల ముందే పుట్టాయి. డైనోసార్స్ అంతరించే సమయంలొ అవొక్కటే survive అయ్యాయి. ఇప్పుడున్న species అన్నింటిలోకి బొద్దింకలే అతి పురాతనమైనవి.

బొద్దింకల గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బొద్దింకలు తల లేకపోయినా వారం రోజులు బ్రతకగలవు.
2. ప్రపంచ జనాభా కంటే, చీమల సంఖ్య 1.6 million రెట్లు ఎక్కువ. అంతే కాదు ప్రపంచ జనాభా మొత్తం బరువు చీమల బరువుతో సమానం. చీమలు, తమ కంటే 10 రెట్లు ఎక్కువ బరువుని మోయగలవు.
౩. IQ ఎక్కువగా ఉన్నవారికి కలలు ఎక్కువగా వస్తాయట. సాధారాణంగా మనకు కలలు వస్తే ఉదయానికి అన్నీ మర్చిపోతాం. కాని IQ ఎక్కువగా ఉన్నవారు, వారికొచ్చే అన్నికలల్ని గుర్తున్చుకోగలరు.
4. మన కడుపులో form అయ్యే acid , zinc metal ని కూడా కరిగిన్చగలదు. కాని మన stomach ని మాత్రం ఏం చెయ్యలేదు. ఎందుకంటే మన కడుపులో ఉండే tissues ఎప్పటికప్పుడు కొత్త layers ని produce చేస్తాయి.
5. తన first attempt లోనే mars పైకి satellite ని పంపిన ఒకే ఒక్క దేశo India. అందులోనూ కేవలం 400 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది.
6. ఒక గ్రామ్ DNA (deoxyribonuclic acid) లో మనం 215 peta bytes అంటే 215 million GB data ని store చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న Digital Information మొత్తాన్ని store చెయ్యడానికి రెండు గ్రాముల DNA చాలు.

7. మన Brain, Morning కంటే Evening చాలా Active గా పని చేస్తుంది . దానికి కారణమేంటో Scientistలు ఇప్పటికీ కనుక్కోలేకపోయారు.

8. ఇప్పటి వరకు మనిషి నిర్మించిన వస్తువులలో అత్యంత ఖరీదైనది ISS (International Space Station). అంతరిక్ష పరిశోధనల కోసం నాసా తయారు చేసిన ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్మాణానికి అయిన ఖర్చు 150 billion dollars అంటే దాదాపు కోట్ల రూపాయలు.
9. మనం 3X3 Rubik's cube ని 43,252,003,274,489,856,000 possible combinations లో పెట్టొచ్చు.సెకనుకి ఒక turn చొప్పున తిప్పినా, మొత్తం అన్నీ పూర్తి చేయడానికి దాదాపు 1400 Trillion సంవత్సరాలు పడుతుంది. మీరు ఈ process ని భూమి పుట్టినప్పుడు start చేసినా ఇప్పటికీ అవ్వదు.
10. మన రక్తం ఒక్క రోజులో దాదాపుగా 19812 km ప్రయాణిస్తుంది. అంటే గంటకు 825 కి.మీ లు ప్రయాణిస్తుంది. ఇది super sonic విమానం వేగం కంటే చాల రెట్లు ఎక్కువ.
11. ప్రపంచం మొత్తంలో దాదాపు 350 million జనాభా FAD అనే వ్యాధితో బాధపడుతున్నారు. FAD అంటే Facebook Addiction Disorder.
12. మనిషిలో ఉండే DNA మొత్తాన్ని సాగదీస్తే, దాని పొడవు దాదాపు 10 billion మైళ్లు ఉంటుంది. అది భూమికి మరియు Pluto కి మధ్య ఉండే దూరానికి రెండు రెట్లు ఎక్కువ. DNA అంటే deoxyribonuclic acid
13. First computer hard disc ని 1979 లో తయారు చేసారు. దాని storage capacity కేవలం 5MB మాత్రమే.
14. అట్లాంటిక్ లో ఉన్న మొత్తం నీటి బరువు, అంటార్కిటికా లో ఉన్న మంచు బరుకుకి సమానం.
15. ఇప్పటివరకు భూమి నుండి 22,000 satellites ని అంతరిక్షంలోకి పంపించారు. వాటిలో పనిచేస్తున్నవి కేవలం 5% మాత్రమే. భూమి నుండి పంపిన మొదటి ఉపగ్రహం "Sputhnik". దీన్ని 1957 లో రష్యా ప్రయోగించింది.
16. Space suit లేకపోయినా, మనిషి అంతరిక్షంలో రెండు నిమిషాలు బ్రతకగలడు. కాని సూర్యుడి నుండి విడుదలయ్యే X-rays, UV-rays మరియు GAMMA rays వల్ల Cancer వచ్చే ప్రమాదం ఉంది.
17. ప్రపంచంలో ప్రతి రోజు 2,00,000 మంది పుడుతున్నారు. 1,72,000 మంది చనిపోతున్నారు. అంటే ఒక రోజులో ప్రపంచ జనాభా 28,000 పెరుగుతుంది.
18. ISRO, 1981 లో ప్రయోగించిన APPLE satellite ని launching station కి ఒక ఎడ్లబండి మీద తీసుకువెళ్ళారు. 
19. మనకి మరియు చింపాంజీ కి DNA 95% ఒకేలా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కాని మనకి మరియు అరటిపండుకి DNA 50% ఒకేలా ఉంటుందని చాలా మందికి తెలీదు.
20. 2011 లో Aimee Davison అనే ఆవిడ ఒక Invisible painting ని కొన్నారు. దాని ఖరీదు 10,000 డాలర్లు. మీరే చూడండి ఆ పెయింటింగ్ ని ఎలా ఉందో.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Blog ని చూస్తూ ఉండండి
Share:

Total Pageviews

Follow Us

Labels